ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న విద్యుత్‌ కష్టాలు

ABN, First Publish Date - 2022-06-07T10:27:04+05:30

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే తప్ప కరెంటు కష్టాలు తీరే దారి కనిపించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వాన పడితేనే వినియోగం తగ్గేది
  • వేసవి మంటతో పెరిగిన డిమాండ్‌
  • 3 నెలల్లో 3,155 కోట్ల విద్యుత్‌ కొనుగోలు
  • విదేశీ బొగ్గు కొనుగోలుపై కేంద్రం పట్టు
  • ఉత్పత్తిలేక సతమతమవుతున్న రాష్ట్రాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే తప్ప కరెంటు కష్టాలు తీరే దారి కనిపించడం లేదు. వేసవి మంటతో రోజు రోజుకు విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఈ నెల 5వ తేదీ దాకా రూ.3,155.97 కోట్ల విలువైన విద్యుత్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేశాయి. ఇది గత ఏడాది కంటే.. రూ.1167.69 కోట్లు ఎక్కువని ఇంధన శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజూ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా చేసేందుకు వీలుగా సగటున 45 నుంచి 50 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సేకరణ భారం పెరుగుతుందని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశీయ స్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌ 18% మేర పెరిగితే.. జాతీయ స్థాయిలో బొగ్గు తవ్వకాలు 3 శాతం మేర మాత్రమే పెరిగాయని రాష్ట్రాలకు కేంద్రం వెల్లడిస్తోంది. రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల అవసరాల్లో 10% విదేశీ బొగును సేకరించుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. 


దీంతో.. విదేశీ బొగ్గు టన్ను రూ.24000 నుంచి 25000 దాకా చెల్లించి 31 లక్షల టన్నులను జెన్కో కొనుగోలు చేస్తోంది. గతంలో టన్ను రూ.4000 నుంచి రూ.4800కు లభించేది. ఇప్పుడు అది ఏకంగా ఆరు రెట్లు పెరిగింది. దీని ప్రభావంతో విద్యుదుత్పత్తి వ్యయం పెరిగి అంతిమంగా వినియోగదారునిపైనే భారం పడుతుందని అధికారులంటున్నారు. రాష్ట్రాలను పునరుత్పాదక ఇంధన కొనుగోళ్లలోకి నెట్టేందుకే.. థర్మల్‌ విద్యుదుత్పత్తి యూనిట్లను మూసివేయించేందుకే కేంద్రం కచ్చితంగా పది శాతం విదేశీ బొగ్గును వాడాల్సిందేనంటూ రాష్ట్రాలకు షరతు విధించిందని ఇంధనరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ఇదే తరహాలో విదేశీ బొగ్గు విధానాన్ని కొనసాగిస్తే.. భవిష్యత్తులో విద్యుత్‌ అంటేనే వినియోగదారులు భయపడే పరిస్థితి వస్తుందని అంటున్నారు. మొత్తానికి.. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిని పరిశీలిస్తే.. భారీ వర్షాలు కురిస్తే తప్ప డిమాండ్‌ తగ్గే అవకాశమే కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-06-07T10:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising