ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shravani Bhargavi song: గాయని శ్రావణి భార్గవిపై మండిపడ్డ తిరుపతి వాసులు

ABN, First Publish Date - 2022-07-23T17:34:44+05:30

గాయని శ్రావణి భార్గవి తీరుపై తిరుపతి వాసులు మండ్డిపడ్డారు. ‘‘ఒకపరి కోకపరి వయ్యారిమై’’ కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని పుణ్యక్షేత్రవాసులు తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: గాయని శ్రావణి భార్గవి(Sravana Bhargavi ) తీరుపై తిరుపతి(Tirupati) వాసులు మండ్డిపడ్డారు. ‘‘ఒకపరి కోకపరి వయ్యారిమై’’ కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని పుణ్యక్షేత్రవాసులు తప్పుబట్టారు. శ్రావణి భార్గవి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  తిరుపతి వాసులు మాట్లాడుతూ... తిరుపతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తారన్నారు. స్వామి వారిని  కీర్తిస్తూ అన్నమయ్య భక్తితో ఆలపించిన సంకీర్తనలను వింటూ ప్రపంచం మొత్తం భక్తి భావంతో  పరవశిస్తోందని తెలిపారు. ‘‘ఒకపరి ఒకపరి వయ్యారమై’’ సంకీర్తనను గాయాని శ్రావణి భార్గవి తనకోసం చిత్రించకరించిన తీరు అభ్యంతరంగా ఉందన్నారు. ఒక సెలబ్రేట్ అనే గర్వంతో అన్నమయ్య(Annamaiah) కుటుంబంతో మాట్లాడారని తెలిపారు.


తిరుపతిలో శ్రావణి భార్గవిని అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేశారు. తిరుమల దర్శనానికి ఆమెను పంపకుండా అడ్డుకుంటామన్నారు. అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా(Social media) నుంచి వెంటనే ఆ కీర్తనను తొలగించాలన్నారు. టీటీడీ(TTD) ఎందుకు ఈ వ్యవహారం పై స్పందించలేదని ప్రశ్నించారు. శ్రావణి భార్గవి వ్యవహార శైలిపై టీడీపీ అధికారులు స్పందించాలన్నారు. అన్నమయ్య కీర్తనలు ఇకపై ఎవరు తప్పుగా చిత్రీకరించకుండా ఓ చట్టాన్ని టీటీడీ తీసుకురావాలని అన్నారు. గాయని శ్రావణి భార్గవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సీఐకు తిరుపతి వాసులు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-07-23T17:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising