ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రాక

ABN, First Publish Date - 2022-11-06T00:26:07+05:30

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు,(స్టోన్‌హౌస్‌పేట), నవంబరు 5 : కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ యాదవ్‌ శనివారం విలేకరులకు వెల్లడించారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు రమారాయల్‌ ఫంక్షన్‌ హాలులో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత 10.45 గంటలకు జయభారత్‌ హాస్పిటల్‌లో జరిగే కార్యక్రమంలో, 11.45 గంటలకు టౌన్‌హాలులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు పల్లెపాడులోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శిస్తారని, సాయంత్రం 6.15 గంటలకు మూలాపేట గణేష్‌ ఘాట్‌లో జరిగే కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి, నేతలు బి శ్రీనివాసులు, ఎర్రబోలు రాజేష్‌, కొత్తపేట వెంకటేశ్వర్లు, మొగరాల సురేష్‌, కందికట్ల రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-06T00:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising