ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి సిబ్బంది కాంట్రాక్టు రెన్యువల్‌

ABN, First Publish Date - 2022-08-17T10:12:09+05:30

‘సమస్యల సుడిలో ఉపాధి సిబ్బంది’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ వార్తకు స్పందన 

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ‘సమస్యల సుడిలో ఉపాధి సిబ్బంది’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పందించారు. వాటర్‌షెడ్‌లో ప్రాజెక్టులు ఆగిపోవడంతో అక్కడి సిబ్బంది కొంతమందిని ఉపాధి హామీ పథకంలో వివిధ పోస్టుల్లో నియమించారు. వారికి ఈ ఏడాది మార్చితో కాంట్రాక్టు పూర్తయినా రెన్యువల్‌ కాకపోవడంతో ఏప్రిల్‌ నుంచి జీతాలు ఆగిపోయాయి. వారితో పాటు ఉపాధి పథకంలో పనిచేసే ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన ఎస్‌ఆర్‌డీఎస్‌ మెంబర్‌ సెక్రటరీ స్లీవారెడ్డి తగు చర్యలు తీసుకున్నారు. ఎఫ్‌టీఈల కాంట్రాక్టు, వాటర్‌షెడ్‌లో 1, 2, 3, 4, 6వ ప్రాజెక్టుల్లో పనిచేసి ఉపాధి హామీ పథకంలోకి మారిన ఆయా డ్వామాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఏప్రిల్‌ నుంచి అక్టోబరు 30 వరకూ కాంట్రాక్టు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో వారి జీతాల విడుదలకు మార్గం సుగమమైంది.

Updated Date - 2022-08-17T10:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising