ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామకు సుప్రీంలో ఊరట..

ABN, First Publish Date - 2022-10-01T20:34:57+05:30

సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎంపీ రఘురామ (MP Raghurama)కు ఊరట లభించింది. సీబీఐ కేసు (CBI Case) విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎంపీ రఘురామ (MP Raghurama)కు ఊరట లభించింది. సీబీఐ కేసు (CBI Case) విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇందు భారత్ ధర్మల్ కంపెనీ (Indu Bharath Thermal Company)పై దాఖలైన సీబీఐ కేసు విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. తన కంపెనీ దివాళా తీసిందంటూ ప్రకటించడాన్ని గతంలో ఎంపీ రఘురామ హైకోర్టు (High Court)లో సవాలు చేశారు. దివాళా కంపెనీగా ప్రకటించడానికి అనుసరించాల్సిన పద్ధతులను అనుసరించలేదన్నారు. మొదట హైకోర్టులోనూ ఎంపీ రఘురామకు ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న హిమా కోహ్లీ (Hima Kohli).. రఘురామపై దాఖలైన సీబీఐ కేసు విచారణపై స్టే విధించారు. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ (Sathish Chandra Sharma) సీజే అయిన తరువాత స్టే తొలగించడం జరిగింది. హైకోర్టు నిర్ణయాన్ని ఎంపీ రఘురామ సుప్రీంలో సవాలు చేశారు. రఘురామ పిటిషన్‌ను న్యాయమూర్తులు అజయ్ రస్తొగి, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తుది తీర్పు వెలువడేంతవరకూ కేసు విచారణను నిలిపివేయాలని సీబీఐఐకి ఆదేశాలను జారీ చేసింది.


Updated Date - 2022-10-01T20:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising