శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో
ABN, First Publish Date - 2022-10-17T10:27:18+05:30
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఆదివారం శ్రీశైల జలాశయానికి భారీ వరద ప్రవాహం నమోదయింది. జూరాల,
దిగువకు 2లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలం, అక్టోబరు 16: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఆదివారం శ్రీశైల జలాశయానికి భారీ వరద ప్రవాహం నమోదయింది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 2,13,800 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతోంది. అధికారులు డ్యామ్ 9 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,50,614 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 884.50 అడుగులుగా నమోదయింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టు నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా నమోదయింది. జలాశయం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రం ద్వారా 26,895 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
Updated Date - 2022-10-17T10:27:18+05:30 IST