ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త.. కొత్తగా..!

ABN, First Publish Date - 2022-04-05T10:21:09+05:30

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆర్డర్‌ టూ సర్వ్‌ కింద పాత జిల్లా కార్యాలయాల్లోని రెగ్యులర్‌ సిబ్బందిని కొత్త, పాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెగ్యులర్‌ సిబ్బంది సర్దుబాటు

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆర్డర్‌ టూ సర్వ్‌ కింద పాత జిల్లా కార్యాలయాల్లోని రెగ్యులర్‌ సిబ్బందిని కొత్త, పాత జిల్లాలకు సర్దుబాటు చేశారు. మార్కెటింగ్‌ శాఖ తరఫున పాత జిల్లాలకు సహాయ సంచాలకుల(ఏడీ)ను, కొత్త జిల్లాలకు సీనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్ల(ఎ్‌సఎంఏ)ను జిల్లా అధికారులుగా నియమించారు. ప్రస్తుతానికి రెగ్యులర్‌ సిబ్బందిని మాత్రమే కొత్త, పాత జిల్లాలకు సర్దుబాటు చేశారు. అలాగే విజయనగరం, ఏలూరు, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురంలో ఉద్యానశాఖ ఉపసంచాలకుల (డీడీ)ను కొనసాగిస్తూ, మిగతా జిల్లాలకు సహాయ సంచాలకుల (ఏడీ)ను నియమించారు. రెగ్యులర్‌ సిబ్బందిని కూడా సర్దుబాటు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రంలో జిల్లా విద్యాశాఖాధికారులను సర్దుబాటు చేశారు. మొత్తం 26జిల్లాల్లోను విద్యాశాఖాధికారులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. గృహనిర్మాణశాఖలో ప్రభుత్వం తాత్కాలికంగా కొత్త జిల్లా అధికారులను నియమించింది. ఇప్పటివరకూ జిల్లా హౌసింగ్‌ అధికారులు ప్రాజెక్టు డైరెక్టర్లుగా ఉండగా ఆ పేరును ‘జిల్లా హౌసింగ్‌ హెడ్‌’గా మార్చింది. తాత్కాలికంగా కొత్త జిల్లాలకు ఎస్‌ఈలు, ఈఈలను ఇన్‌చార్జ్‌ జిల్లా అధికారులుగా నియమిస్తూ హౌసింగ్‌ ఎండీ భరత్‌ గుప్తా ఆదేశాలిచ్చారు.


Updated Date - 2022-04-05T10:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising