వైసీపీలో తిరుగుబాటు మొదలైంది
ABN, First Publish Date - 2022-12-31T05:17:43+05:30
‘‘వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు అహంకారానికీ ఆత్మాభిమానానికీ మధ్య సమరం. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్ అయితే.. ఆత్మాభిమానానికి ఒకప్పుడు ప్రతీక నేను, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి.
ఆత్మాభిమానానికి ప్రతీక నాడు నేను.. నేడు ఆనం
దమ్ముంటే ఆనం, కోటంరెడ్డిలపై అనర్హత వేటు వేయాలి: వైసీపీ ఎంపీ రఘురామ
న్యూఢిల్లీ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు అహంకారానికీ ఆత్మాభిమానానికీ మధ్య సమరం. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్ అయితే.. ఆత్మాభిమానానికి ఒకప్పుడు ప్రతీక నేను, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి. ఇన్నాళ్లూ ఓపిక ప ట్టి, అవమానాలను సహించిన వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వస్తున్నారు’’ అని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. ప్రజలకు ఏమి చేశామని ఓ ట్లు అడగమంటారని ఇటీవల ఆనం సీఎంను ప్రశ్నించిన విషయం తెలిసిందేనన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అహంకారపూరిత వైఖరిని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి సైతం ప్రశ్నించారని రఘురామ తెలిపారు. తాను ఏనా డూ పార్టీని విమర్శించలేదని. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల ను మాత్రమే ఎత్తి చూపానన్నారు. ఆరోజు తాను చేసింది నేరం, దోషం అయితే.. ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డిలపై దమ్ముంటే అనర్హత వేటు వేయాలన్నారు. స్మార్టు మీటర్ల ద్వారా రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు అవినీతికి పథక రచన చేశారని ఆరోపించారు. యువగళం పేరిట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించడం దివాలా కోరుతనానికి నిదర్శనమని, అసలు పాదయాత్రను అడ్డుకోవడానికి వీరెవరని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇలాగే నిరంకుశంగా వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని నిలదీశారు. ఇక, ప్రభుత్వం నిర్వహించే సభలకు ప్రజలు ఎందుకు వస్తారని, ఇసుక దోపిడీ మొదలుకుని పింఛన్ల తొలగింపు వరకు అన్ని విధాలా జనాన్ని మోసం చేసినందుకా అని రఘురామ ప్రశ్నించారు. విశాఖ ఎంవీపీ కాలనీ, ఉషోదయ జంక్షన్‌లోని పార్కులో గత ప్రభుత్వ హ యాంలో మానసిక వికలాంగుల కోసం సంవత్సర కాలానికి స్థలాన్ని లీజుకు ఇచ్చిందని, అయితే గత ఏడాది జూన్ 21వ తేదీన విజయసాయి మనుషులు మానసిక వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును, కూల్చివేశారని చెప్పారు. ఈ పాఠశాల కోసం నామ మాత్రపు ధరకు ప్రభుత్వ స్థలాన్ని లీజుకు ఇస్తే, ఆ లీజు సొమ్ము మొత్తాన్ని తానే చెల్లిస్తానని, 200 మంది మానసిక వికలాంగులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్థలాన్ని కేటాయించాలని రఘురామ కోరారు.
Updated Date - 2022-12-31T05:17:44+05:30 IST