ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండవీడు కోటలో అరుదైన మొక్క

ABN, First Publish Date - 2022-02-14T07:42:18+05:30

కొండవీడు కోటలో అరుదైన మొక్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ఉపఖండంలోనే తొలిసారి గుర్తింపు


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 13: భారత ఉపఖండంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర పరిశోధకులు గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటలో కనుగొన్నారు. ఎస్వీయూ వృక్షశాస్త్ర పరిశోధకుడు మొట్టా మహేంద్రనాథ్‌, పుణెలోని గోద్రేజ్‌ మొక్కల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ మయూర్‌ నందికర్‌ ఈ మొక్కను కనిపెట్టారు. కొమెలీనాసియా కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం కొమెలీనా ఎరెక్టా. ఇది అత్యంత అరుదైన వృక్షజాతికి చెందినదని నిర్దారించారు. ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా పెరిగే ఈ మొక్కను భారత ఉపఖండంలో తొలిసారిగా గుర్తించినట్టు వారు చెప్పారు. సెప్టెంబరు, నవంబరు మాసాల్లో ఈ మొక్క పుష్పిస్తుందని పేర్కొన్నారు. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించే ‘నెలుంబో’ జర్నల్‌లో ఈ మొక్క సమగ్ర వివరాలు ప్రచురితమైనట్టు తెలిపారు. ఈ మొక్క వల్ల మానవ జాతికి కలిగే ప్రయోజనాల గురించి తాము అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-02-14T07:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising