ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: వెంకటగిరి వైసీపీలో ప్రోటోకాల్ వివాదం

ABN, First Publish Date - 2022-10-07T21:32:38+05:30

నెల్లూరు జిల్లా (Nellore Dist.): వెంకటగిరి వైసీపీ (YCP)లో ప్రోటోకాల్ (Protocol) వివాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా (Nellore Dist.): వెంకటగిరి వైసీపీ (YCP)లో ప్రోటోకాల్ (Protocol) వివాదం నెలకొంది. ఈ సందర్భంగా వైసీపీ నేత, స్టేట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (Ram Kumar Reddy) మాట్లాడుతూ వెంకటగిరిలో జరిగే అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అమలు కావడం లేదని, జిల్లా మహిళా మంత్రి రోజా (Roja)కు, తనకు అవమానం జరుగుతోందన్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా మంత్రి రోజాను, క్యాబినెట్ రాంక్ ఉన్న తనను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Ramanarayana reddy)కి తెలియకుండా అధికారులు ఇవన్నీ చేస్తున్నారేమోనని అన్నారు. ప్రోటోకాల్ విషయంపై జిల్లా కలెక్టర్, ప్రివిలైజ్ కమిటీ, జీఏడీకి ఫిర్యాదు చేస్తానన్నారు. దీన్ని అధికారులు‌ వార్నింగ్ అనుకుంటారో, మరేమనుకుంటారో వారిష్టమన్నారు. మరోసారి ప్రోటోకాల్ విషయంలో తప్పు జరిగితే సహించేది లేదని రాంకుమార్ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-10-07T21:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising