ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణయాప్ ఆగడాలు.. నగ్న ఫోటోలు వాట్సప్‌లో షేర్...యువకుడు బలి

ABN, First Publish Date - 2022-06-28T16:39:36+05:30

రుణయాప్ ఆగడాలు తట్టుకోలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రుణయాప్ ఆగడాలు తట్టుకోలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. కడియంకు చెందిన కోనా సతీష్(28) లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే రుణం చెల్లించాలంటూ యువకుడిపై  యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకువచ్చారు. యువకుడిని మానసికంగా తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. చివరకు నగ్నంగా ఉన్న వేరే పోటోకు సతీష్ తలతో ఉన్న ఫోటో అతికించి స్నేహితుల వాట్సాప్ నంబర్లకు షేర్ చేసి ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సతీష్ ఈనెల 24న భీమవరం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.


సతీష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా అప్పు చెల్లించాలంటూ ఈనెల 26 నుంచి కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్ మెసేజ్‌లు పంపుతూ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. అప్పు చెల్లించలేకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వాట్సాప్‌లో అందరికీ షేర్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు కడియం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-28T16:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising