ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచెత్తిన వాన

ABN, First Publish Date - 2022-08-04T08:30:29+05:30

ముంచెత్తిన వాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి అనంతలో  ఉప్పొంగిన నదులు, వాగులు

అనేక గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

అల్లూరి జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి

54 మూగ జీవాలు కూడా మృత్యువాత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

 ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజూ భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి 13 మండలాల్లో వర్షం కురిసింది. కంబదూరులో అత్యధికంగా 79.2, ఆత్మకూరులో 53.6, కుందుర్పిలో 45.2, కూడేరులో 34.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం నగరంతోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. కూడేరు మండలం చోళసముద్రం గ్రామంలో విధులన్నీ జలమయమయ్యాయి. సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహరిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. కంబదూరు, కళ్యాణదుర్గం, ఉరవకొండ మండలాల్లోని పలు ప్రాంతాల్లో పొలాల్లోకి నీరు చేరడంతో టమోటా, వేరుశనగ, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. జల్లిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆరు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని 781.78 హెక్టార్లల్లో రూ.5.62 కోట్లకుపైగా ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. అరటి, బీన్స్‌,  అనప, చీనీ, కర్బూజ, కళింగర, జామ, మిరప, ఉల్లి, దానిమ్మ, బొప్పాయి, టమోటా తదితర ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శ్రీసత్యసాయి జిల్లాలో నదులు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. పెన్నా, చిత్రావతి, కుషావతి, జయమంగళి నదులు, వంకలు, వాగులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొత్తచెరువు, ధర్మవరం, మేడాపురం, వెల్థుర్తి, అమిదాలకుంట రాకపోకలకు అంతరాయం కల్గింది. జయమంగళి నదికి వరదపోటుతో హిందూపురం-పరిగి మధ్య బుఽధవారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. మడకశిర-పెనుకొండ రహదారిలోని దొడగట్ట వద్ద వాగు ఉధృతికి ప్రైవేట్‌ బస్సు ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మొక్కజొన్న పత్తి, టమోటా, పొద్దుతిరుగుడు, వరి, మల్బరీ పంటలు నీట మునిగాయి. గుడిబండ చెరువు నిండి పారుతుండటంతో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వెళ్తున్న 10 మంది విద్యార్థులు ఆ బస్సు ఉండటంతో ఎస్‌ఐ సురేశ్‌, తన సిబ్బందితో కలిసి విద్యార్థులను వాగు దాటించి పరీక్షా కేంద్రానికి చేర్చారు. 


 గిరిజనుడు మృతి

 ఏజెన్సీలో పిడుగుపాటుకు గిరిజనుడితోపాటు 54 మూగజీవాలు బలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జమదంగి గ్రామంలో మంగళవారం వంతాల సన్నిబాబు (40) పశువులు, మేకలను మేపేందుకు సమీప అడవుల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం ఐదు గంటలకు ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పిడుగు పడడంతో సన్నిబాబు అక్కడికక్కడే మరణించారు. 40 పశువులు, 14 మేకలు కూడా చనిపోయాయి.  

Updated Date - 2022-08-04T08:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising