ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: ఏపీ రుణాల సేకరణపై లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2022-07-21T19:51:18+05:30

ఏపీలో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణపై లోక్ సభలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): ఏపీ (AP)లో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణపై గురువారం లోక్ సభ (Lok Sabha)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ప్రస్తావించారు. దీంతో ఆయనను వైసీపీ ఎంపీలు (YCP MPs) అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు, రఘురామల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం (AP Govt.) కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తున్నారని రఘురామ ఆరోపించారు. బేవరేజెస్ కార్పొరేషన్ (Beverages Corporation) పేరుతో రుణాలు తీసుకుంటున్నారని, ఏపీ మూలనిధికి నిధులను జమ చేయడం లేదని ఆరోపించారు.


ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు మార్గాని భరత్ (Margani Bharat), వంగ గీత (Vanga Geeta) మాట్లాడుతూ రఘురామ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రఘురామ అన్నారు. ఏపీ ప్రభుత్వం కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకునేందుకు ప్రత్యేక జీవోను కూడా తెచ్చిందని అన్నారు. ఈ క్రమంలో రఘురామ ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు పదే పదే అడ్డుకున్నారు. దీంతో సహనాన్ని కోల్పోయిన రఘురామ... సిట్ డౌన్ అంటూ వైసీపీ ఎంపీలపై అరిచారు. తమను కూర్చోమని చెప్పడానికి రఘురామ ఎవరంటూ  వైసీపీ ఎంపీలు వివాదానికి దిగారు.

Updated Date - 2022-07-21T19:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising