ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2022-09-21T21:05:56+05:30

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) స్పందించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పథకాలకు ప్రభుత్వం పెడుతున్న పేర్లు వింటేనే ప్రజలకు అసహ్యం వేస్తోందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి.. వాహన మిత్రకు సంబంధం ఏంటన్నారు. పేరు మార్పు నిర్ణయంతో పార్టీ తుడుచుకుపోయే ప్రమాదం ఉందన్నారు. పేరు మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్‌కు సూచించారు.


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 1986 స్థాపించారని రఘురామ అన్నారు. చంద్రబాబు ఒకటి అరా తప్ప ఎప్పుడు ఆయన పేరు పెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టి, జగన్ బయటకు వచ్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే కాంగ్రెస్ వదిలి వెళ్ళేవారు కాదన్నారు. తెలుగు వాడికి గౌరవం తీసుకొచ్చిన ఎన్టీఆర్ పేరునే తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చేవారని రఘురామ అన్నారు.

Updated Date - 2022-09-21T21:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising