ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామ సవాల్

ABN, First Publish Date - 2022-01-10T20:36:53+05:30

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 5లోగా తనను ఎంపీగా డిస్ క్వాలిఫై చేయించాలన్నారు. లేదంటే దమ్ములేని సీఎంగా ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ, అమిత్‌షా, స్పీకర్‌కు ఎవరికైనా తనపై ఫిర్యాదు చేసుకోవాలన్నారు.


ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముందని, సచివాలయ ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి.. ప్రజల కష్టాలు చూడాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండానే ఆరోగ్యశ్రీ తొలగించారని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదని, సీఎం జగన్ మొద్దునిద్ర వదిలి ఉద్యోగుల ఆందోళనలు చూడాలని సూచించారు. భీమిలి ఎంఆర్‌వో ఉద్యోగులను బెదిరిస్తున్నారని, ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.

Updated Date - 2022-01-10T20:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising