ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎంపికపై సీఈసీతో రఘురామ భేటీ

ABN, First Publish Date - 2022-07-11T22:18:21+05:30

సీఈసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju) భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సీఈసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju) భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైసీపీ (YCP) శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్‌ను ప్రకటించడంపై ఫిర్యాదు చేశారు. పీపుల్ యాక్ట్ 1951 ఉల్లంఘించారని రఘురామ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ శాశ్వత అధ్యక్షుడు పదవి అనేదే అశాశ్వతమన్నారు. రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదని తెలిపారు. మనసులో ఏదో భయాలు పెట్టుకొనే.. శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్‌ (Jagan) అనుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఇలాంటి కేసు సీఈసీ ముందుకు రాలేదని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి, సీఈసీకి ఇది పూర్తిగా విరుద్ధమని ప్రకటించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ప్లీనరీకి ముందొక మాట.. తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. మాజీమంత్రి వివేకా కుమార్తె సునీత వైసీపీలో చేరదని రఘురామకృష్ణరాజు తెలిపారు.


వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ప్లీనరీ ఎన్నుకున్నట్లు విజయసాయిరెడ్డి శనివారం ప్రకటించారు. ఆయన్ను ఈ పదవిలో ఎన్నుకోనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గురువారమే వెల్లడించింది. ప్లీనరీ తొలిరోజున శుక్రవారం అధ్యక్ష పదవి కోసం నామినేషన్లను స్వీకరించారు. జగన్‌ ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఆయన్ను జీవితకాల అధ్యక్షుడిగా నియమించేందుకు వీలుగా పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణకు ప్లీనరీ ఆమోదం తెలిపింది. 


నియంతలు మాత్రమే రాజ్యమేలే దేశాల్లో పార్టీలకు శాశ్వత అధ్యక్షులు ఉన్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఆ విధానం లేదు. అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ప్రజాప్రాతినిధ్య చట్టం. దాని అమలుకు నిర్దిష్ట నియమావళి ఉంది. అది ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డికీ వర్తిస్తుంది. ఆ రూల్స్‌ ప్రకారం ఏ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చెల్లుబాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లకో, ఇంకా ముందుగానో ప్రతి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి.. అధ్యక్షుడు, ఇతర పదాధికారులను ఎన్నుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి తేల్చిచెబుతోంది.

Updated Date - 2022-07-11T22:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising