ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఐఏఎస్‌ పి.వి.రమేష్‌ సోదరుడు రాజశేఖర్‌ జోషి అదృశ్యం

ABN, First Publish Date - 2022-02-06T00:06:40+05:30

సీనియర్‌ మాజీ ఐఏఎస్‌ పి.వి.రమేష్‌ సోదరుడు రాజశేఖర్‌ జోషి అదృశ్యమయ్యారు. గతంలో జోషిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీనియర్‌ మాజీ ఐఏఎస్‌ పి.వి.రమేష్‌ సోదరుడు రాజశేఖర్‌ జోషి అదృశ్యమయ్యారు. గతంలో జోషిపై భార్య సంధ్య గృహ హింస కేసు పెట్టారు. ఈ కేసులో జోషిని అరెస్ట్‌ చేయవద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే కేసులో జోషి తండ్రి, తల్లికి బెయిల్‌ వచ్చింది. రమేష్‌ సోదరుడు రాజశేఖర్‌ జోషి గత రాత్రి రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లారు.  రాత్రి జోషి ఇంటిని విజయవాడ పోలీసులు చుట్టుముట్టారు. అయితే ఆ సమయంలో జోషి అదృశ్యం అయ్యారు. దీంతో జోషి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ చెప్పాలని జోషి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడిని ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడిని ఏ కేసు విషయమై పోలీసులు తీసుకెళ్లారో తమకు తెలియదని వృద్ధ దంపతులు అంటున్నారు. జోషి అదృశ్యం వెనుక ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ హస్తం ఉందని జోషి తల్లిదండ్రులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కోడలు చేత సునీల్ కుమార్ తమపై కేసు పెట్టించి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ కుమార్‌కు తమ కూతురుని ఇచ్చి తప్పు చేశామని జోషి తల్లిదండ్రులు అంటున్నారు. రాజమండ్రి ఓఎన్‌జీసీలో జనరల్‌ మేనేజర్‌గా జోషి పని చేస్తున్నారు. జోషి అదృశ్యంపై హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హౌస్‌ మోషన్‌ మూవ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 



Updated Date - 2022-02-06T00:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising