ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొఫెసర్‌ గంగప్ప అస్తమయం

ABN, First Publish Date - 2022-10-08T09:59:25+05:30

ప్రొఫెసర్‌ గంగప్ప అస్తమయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సాంస్కృతికం) అక్టోబరు 7:  ప్రముఖ సాహితీ విమర్శకులు, రచయిత, నాగార్జున విశ్వవిద్యాలయ రిటైర్డ్‌ ఆచార్యులు, బహు గ్రంథకర్త, ఆచార్య ఎస్‌.గంగప్ప(85) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. పలువురు సాహితీవేత్తలు, సాహితీ సంస్థల ప్రతినిధులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయుని పల్లెలో 1936లో గంగప్ప జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం, అనంతపురంలో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. కాకినాడ, విశాఖ, హైదరాబాద్‌, కర్నూలులో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. 1978 నుంచి ఏఎన్‌యూలో తెలుగుశాఖ అధ్యక్షునిగా వివిధ హోదాల్లో సేవలు అందించారు. వీరి సాహితీ ప్రతిభకు ఆంధ్రప్రదేశ్‌ సాహితీ అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు వర్సిటీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హంస పురస్కారం వరించాయి. కాగా, శనివారం గుంటూరు ఎస్‌వీఎన్‌ కాలనీలోని ఆయన స్వగృహం సి-73 నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. 


Updated Date - 2022-10-08T09:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising