ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్విస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ కల్యాణచక్రవర్తికి ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN, First Publish Date - 2022-09-19T10:00:02+05:30

ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ నిడమానూరి కల్యాణ చక్రవర్తికి బ్రిటన్‌కు చెందిన వరల్డ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (విద్య), సెప్టెంబరు 18: ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ నిడమానూరి కల్యాణ చక్రవర్తికి బ్రిటన్‌కు చెందిన వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ డ్రైవ్‌ (డబ్ల్యూహెచ్‌డీ) సంస్థ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన సమ్మిట్‌లో సంస్థ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ అబ్దుల్‌ బాసిత్‌ సయ్యద్‌, ఇతర అతిథులు ఈ అవార్డును కల్యాణచక్రవర్తికి ప్రదానం చేశారు. కల్యాణ చక్రవర్తి అమెరికాలోని ఇంజనీరింగ్‌ సొసైటీ ఆఫ్‌ డెట్రాయిట్‌-మిచ్‌గన్‌లో సభ్యులుగా ఉన్నారు. శ్రీ నిడమానూరి ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించి ఇంజనీరింగ్‌ కళాశాల, కాలేజీలు, స్కూళ్లు నడుపుతున్నారు. విద్యతో పాటు, సామాజిక అవసరాలపై అవగాహన కల్పిస్తున్నారు. వీటన్నింటినీ గుర్తించిన డబ్ల్యూహెచ్‌డీ కల్యాణ చక్రవర్తికి ఈ అవార్డును ప్రదానం చేసింది. 

Updated Date - 2022-09-19T10:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising