ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని శాఖలకు పీఆర్‌సీ షెడ్యూల్‌

ABN, First Publish Date - 2022-08-20T09:54:32+05:30

పదకొండవ పీఆర్‌సీ రికమెండ్‌ చేసిన క్యాడర్‌ వారీ పేస్కేళ్లను షెడ్యూల్‌ రూపంలో అన్ని శాఖలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ బృందం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రివర్గ బృందం హామీ ఇచ్చిందన్న బొప్పరాజు 

అమరావతి/విజయవాడ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పదకొండవ పీఆర్‌సీ రికమెండ్‌ చేసిన క్యాడర్‌ వారీ పేస్కేళ్లను షెడ్యూల్‌ రూపంలో అన్ని శాఖలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ బృందం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘కొత్త పీఆర్‌సీ అమలైన వెంటనే 130కి పైగా డిపార్ట్‌మెంట్ల శాఖాధిపతులకు సంబంధిత పేస్కేల్‌ షెడ్యూల్‌ను అందిస్తారని చెప్పారు. పీఆర్‌సీపై ఇప్పటివరకు షెడ్యూల్‌ ఇవ్వలేదని మంత్రుల బృందం దృష్టికి తీసుకురాగా తక్షణం శాఖలన్నింటికీ పంపేందుకు హామీ ఇచ్చారు’’ అని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీకి సంబంధించి ఆర్థికశాఖ అధికారులతో తక్షణమే పీటీడీ పేస్కేల్స్‌ ఆమోదించి పంపాలని కోరినట్టు తెలిపారు. తాము అడగకపోయినా కార్పొరేషన్‌, యూనివర్సిటీ, గురుకుల ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 ఏళ్ళు వర్తింప జేయడంపై వీలైనంత త్వరలో ఉత్తర్వులు ఇప్పిస్తామని మంత్రివర్గ బృందం హామీ ఇచ్చినట్టు తెలిపారు. 

Updated Date - 2022-08-20T09:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising