ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పశ్చిమ’లో సమర శంఖం

ABN, First Publish Date - 2022-01-24T00:35:44+05:30

పశ్చిమ గోదావరి జిల్లాలో పీఆర్సీ సాధన సమితి సమర శంఖం పూరించింది. ఏలూరులోని ఎన్‌జీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పీఆర్సీ సాధన సమితి సమర శంఖం పూరించింది. ఏలూరులోని ఎన్‌జీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలు ఒక్కటై ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. 25వ తేదీ జిల్లా కేంద్రం ఏలూరులో వేలాది మంది ఉద్యోగులతో ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుందని సంఘాల నేతలు హెచ్చరించారు. క్విట్‌ ఇండియా స్ఫూర్తితో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీరికి కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, సీఐటీయూ ట్రేడ్‌ యూనియన్లు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. ఉద్యోగులకు తోడుగా ఆశ, అంగన్వాడీ, మున్సిపల్‌, పంచాయతీ పారిశుధ్య కార్మికులను సమ్మెలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చాయి. ఆర్టీసీ ఉద్యోగులు, న్యాయ శాఖ ఉద్యోగులు సమ్మెలో భాగసామ్యం కానున్నట్లు రౌండ్‌ టేబుల్‌ వేదికపై ప్రకటించారు. జిల్లాలోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులను కలుపుకుని ప్రభుత్వ కార్యకలాపాల్ని స్తంబింపజేసేలా ఉద్యమాన్ని నడపాలని సమావేశం తీర్మానించింది. 

Updated Date - 2022-01-24T00:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising