ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గుతున్న ప్రభుత్వం.. పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల పిలుపు

ABN, First Publish Date - 2022-01-23T20:40:08+05:30

ఉద్యోగులు ఉద్యమానికి ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల నుంచి పిలుపు వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగులు ఉద్యమానికి ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల నుంచి పిలుపు వచ్చింది. సంప్రదింపులకు రావాలని మంత్రులు కోరారు. స్టీరింగ్ కమిటీలో చర్చ తర్వాత నిర్ణయం ఉంటుందని నేతలు వెల్లడించారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఉద్యమ కార్యాచరణ ఆదివారం నుంచి ప్రారంభమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నాయి. నాలుగు జేఏసీలతో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించింది.


ఉద్యమ కార్యాచరణలో మొదటగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వరంలో అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్ర సచివాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందించిన విధానం, ప్రభుత్వ మొండి వైఖరిపై పోరాడాల్సిన తీరు, ఉద్యోగులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏ విధంగా తిప్పి కొట్టాలనే అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకానున్నారు.

Updated Date - 2022-01-23T20:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising