ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన నువ్వు సాగు

ABN, First Publish Date - 2022-05-17T06:16:22+05:30

అసాని తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు పొలాలు పదునుకావడంతో రైతులు నువ్వు సాగుకు ఉపక్రమించారు. చాలా ఏళ్ల తర్వాత ముందస్తుగానే విత్తనాలు చల్లకం, గొర్రుతోలకం ప్రారంభించారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సబ్సిడీపై నువ్వు విత్తనాలను రైతులకు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. తొలి విడత కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని రైతుల పేర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించారు.

కందులూరులో నువ్వు విత్తనాలు చల్లుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసాని ప్రభావంతో కురిసిన 

వర్షాలకు పదునైన పొలాలు

టంగుటూరు, మే 16 : అసాని తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు పొలాలు పదునుకావడంతో రైతులు నువ్వు సాగుకు ఉపక్రమించారు. చాలా ఏళ్ల తర్వాత ముందస్తుగానే విత్తనాలు చల్లకం, గొర్రుతోలకం ప్రారంభించారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సబ్సిడీపై నువ్వు విత్తనాలను రైతులకు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.  తొలి విడత కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని రైతుల పేర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. 150 మంది రైతులకు 700 ఎకరాలకు సరిపడా విత్తనాలు అందించనున్నారు. తొలి విడత పేర్లు రిజిస్టర్‌ అయిన రైతులకు సబ్సిడీ నువ్వు విత్తనాలు మంగళవారం విడుదల కానున్నాయి. కాకుటూరివారిపాలెం, కొణిజేడు, ఎం.నిడమలూరు, పొందూరు, తూర్పునాయుడుపాలెం రైతులకు ఆయా గ్రామాల రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీ విత్తనాలు అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 

బయట కొనుగోళ్లు

రాయితీ విత్తనాల కోసం ఎదురుచూడకుండానే అనేక మంది రైతులు నువ్వు విత్తనాలను బయట కొనుగోలు చేస్తున్నారు. ఒంగోలులోని కొందరు ప్రైవేటు వ్యాపారుల నుంచీ కొంటున్నారు. ఇప్పటికే పొలాలన్నీ ఆరిపోవడంతో కందులూరు, మరికొన్ని గ్రామాల్లో నువ్వులు చల్లుతున్నారు. ఎక్కువ మంది రైతులు తమ పొలాల్లో నేరుగా నువ్వులు చల్లి తర్వాత గొర్రుతోలుకుంటున్నారు. మండలంలో సుమారు 4వేల ఎకరాల్లో నువ్వ సాగు జరగవచ్చని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. పొలాల్లో ఇప్పటి పదును మరో 20 రోజుల వరకు సరిపోతుందని, వచ్చే నెలలో ఒక పదును వాన పడితే ఇక నువ్వు పంటకు ఇబ్బంది ఉండదని వారు చెప్తున్నారు. నువ్వు పంట కలసి వస్తే రబీ సాగుకు కావలసిన పెట్టుబడులకు ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు

 

Updated Date - 2022-05-17T06:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising