ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీ : ఎరిక్షన్‌బాబు

ABN, First Publish Date - 2022-08-07T06:46:24+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో నిత్యావసరాలతోపాటు అన్ని రకాల ధరలూ పెరిగాయన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న ఎరిక్షన్‌బాబు, నూకసాని బాలాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపురాంతకం, ఆగస్టు 6: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో నిత్యావసరాలతోపాటు అన్ని రకాల ధరలూ పెరిగాయన్నారు. మండలంలోని ముడివేముల పంచాయితీ పరిధిలోని కొత్తముడివేముల, పాతముడివేముల, పాపన్నపాలెం గ్రామాల్లో బాదుడే - బాదుడు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీలు అన్నీ అబద్దాలేనని అన్నారు. ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ బిల్లులు, డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలను ప్రభుత్వం పెంచుతూ పోతోందన్నారు.  టీడీపీ ఒంగోలుపార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ బీసీలకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించి, అభివృద్ది చేసింది టీడీపీ మాత్రమేనని అన్నారు. నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బతికి బట్టకడుతుందన్నారు. అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని మార్కాపురం జిల్లా ఏర్పాటవుతుం దన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే తాగు సాగు అవసరాలు తీర్చే వెలుగొండ పూర్తవుతుందన్నారు. అంతకుముందు గ్రామాల్లో ఇంటింటికీ ర్యాలీగా తిరిగి టీడీపీని రానున్న ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరాన్ని కరపత్రాలు పంచుతూ వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మేకల వలరాజు, నాయకులు మోటకట్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాసరరెడ్డి, దేవినేని చలమయ్య, వంకాయలపాటి ఆంజనేయులు, ఊట్ల వెంకటేశ్వర్లు, ఎం.అల్లూరిరెడ్డి, కటికి ఏడుకొండలు, ఒడ్డుపాలెం సర్పంచ్‌ ఎం.పిచ్చయ్య, వి.అంకారావు, పయ్యావుల ప్రసాదు, చేకూరి సుబ్బయ్య, కాకర్ల కోటయ్య, పోట్ల గోవిందు, మాబు, పిచ్చయ్య నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T06:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising