ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతిలో అగ్రస్థానంలో వైసీపీ : కందుల

ABN, First Publish Date - 2022-12-06T23:24:00+05:30

దేశంలో అవినీతిలో అగ్రస్థానం వైసీపీదేనని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో సోమవారం రాష్ట్రానికి ఇదేంఖర్మ కార్యక్రమం నిర్వహిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, డిసెంబరు 6: దేశంలో అవినీతిలో అగ్రస్థానం వైసీపీదేనని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో సోమవారం రాష్ట్రానికి ఇదేంఖర్మ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందు ల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అదే విధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. పలకల పరిశ్రమ దెబ్బతినడంతో అసలే పనులు కోల్పోయామని, ప్రభుత్వ పింఛన్లు సైతం రద్దు చేశారని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడు తూ పేదలు, వృద్ధుల పింఛన్లు తొలగించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చిన వెంటనే తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామన్నారు. కార్యక్రమం లో నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్‌ కో-ఆర్డినేటర్‌ కందుల రామిరెడ్డి, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లి కార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, టీడీపీ నాయకులు అల్లంపల్లి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు సయ్యద్‌ గఫార్‌, తదితరులు పాల్గొన్నారు.

కొమరోలు : టీడీపీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని హసనాపురం గ్రామంలో మంగళవారం ఇదేంఖర్మ ఈ రాష్ర్టానికి కార్య క్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి కర పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా రైతు కార్యాదర్శి వీవీ రాఘవరెడ్డి, మండల ప్రధానకార్యాదర్శి బిజ్జాల తిరుమల రెడ్డి, మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవ రెడ్డి, నాయకులు బిజ్జం వెంకట్రామిరెడ్డి, ఎంబీసీ స్టెట్‌ కమిటీ మెంబర్‌ అనపవీర శేఖర్‌, పందరబోయిన గోపాల క్రిష్ణయాదవ్‌, గుర్రం క్రిష్ణబాబు, షేక్‌ నభీ, ప్రసాదు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising