ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీరు అందించాలని జాతీయరహదారిపై రాస్తారోకో

ABN, First Publish Date - 2022-08-17T06:18:43+05:30

మండల కేంద్రం కొనకనమిట్ల బస్టాండ్‌ సెంటర్‌లో తాగునీరు అందించాలని గ్రామస్థులు మంగళవారం జాతీయరహదారిపై ఖాళీబిందెలతో రాస్తారోకో చేశారు.

రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొనకనమిట్ల, ఆగస్టు 16 : మండల కేంద్రం కొనకనమిట్ల బస్టాండ్‌ సెంటర్‌లో తాగునీరు అందించాలని గ్రామస్థులు మంగళవారం జాతీయరహదారిపై ఖాళీబిందెలతో రాస్తారోకో చేశారు. గత ఇరవై రోజులుగా తాగునీరు రావడం లేదని తాగునీరు అందించాలని అధికారులకు, నాయకులకు ఎన్నీసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. గ్రామంలో ఉన్న డీప్‌బోర్లు మరామ్మతులకు గురయ్యాయని పలువురు గ్రామస్థులు పేర్కొన్నా రు. అధికారులకు పలుమార్లు పిర్యాదు చేశామన్నారు. అయితే ఏ ఒక్క అధికారి తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండి పడ్డారు.  చేసేది లేక 565 జాతీయ రహదారిపై ఖాలీబిందెలతో నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచి పోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎద్కొన్నారు. పంచాయితీ కార్యదర్శి రాజకుమారి జోక్యం చేసుకొని గ్రామంలో డీప్‌బోర్లు మరామ్మతులు చేయించి ప్రజలకు నీరు అందించే విదంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. పోలీసులు భారీగా నిలిచిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. 

Updated Date - 2022-08-17T06:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising