ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-05T05:32:46+05:30
మండలంలోని పసుపుగల్లు ఎస్సీ కాలనీకి చెందిన వరగాని అచ్చమ్మ(49) అనే మహిళ మంగళవారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ముండ్లమూరు, జనవరి 4: మండలంలోని పసుపుగల్లు ఎస్సీ కాలనీకి చెందిన వరగాని అచ్చమ్మ(49) అనే మహిళ మంగళవారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అచ్చమ్మ తన కోడలు రోజమ్మకు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన అచ్చమ్మ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ జీ.వెంకట సైదులు పరిశీలించారు. అచ్చమ్మ కుమారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మరో ఘటనలో..
ముండ్లమూరు, జనవరి 4: మండలంలోని పోలవరం ఎస్సీ కాలనీకి చెందిన కారుమంచి సుశీల(35) అనే మహిళ ఉరివేసుకొని మంగళవారం సాయంత్రం మృతి చెందింది. మేదరమెట్ల గ్రామానికి చెందిన సుశీలను పోలవరానికి చెం దిన కారుమంచి సుబ్బారావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి నలుగురు పిల్ల లు ఉన్నారు. పిల్లలను పాఠశాలకు పంపే విషయంలో భార్యాభర్తల మధ్య కొ న్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో సుశీల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. మృతదేహాన్ని బంధువులు అద్దంకి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Updated Date - 2022-01-05T05:32:46+05:30 IST