ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తా : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-10-17T06:03:33+05:30

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని కలుజువ్వలపాడులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.

కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తర్లుపాడు, అక్టోబరు 16: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని కలుజువ్వలపాడులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రతి గడపకెళ్లి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా కలుజువ్వలపాడు పంచాయతీలో మంచినీటి సమస్య ఉందని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, నిరుపేదలకు త్వరలో జరగ నున్న అసైన్మెంట్‌ కమిటీలో పట్టాలు ఇప్పించాలని పలువురు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.., పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అసైన్మెంట్‌ కమిటీలో అర్హులైన నిరుపేదలకు భూములు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ, గ్రామ సర్పంచ్‌ ఎం.శికోమణి, ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు టి.రమణారెడ్డి, డి.పెద్దమస్తాన్‌, గాయం శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నాయకులు ఎం.వెంకటరెడ్డి, కొండారెడ్డి, రామసుబ్బారెడ్డి, రమేష్‌రెడ్డి, రామిరెడ్డి, పలువును నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising