ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు?

ABN, First Publish Date - 2022-08-05T05:13:16+05:30

వ్యవసాయ మోటర్ల విద్యుత్‌ కనెక్షన్లకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించేటట్లయితే ఇప్పుడు మోటర్లకు మీటర్లెందుకని మండలంలోని పొందూరు రైతులు విద్యుత్‌శాఖ అధికారులను ప్రశ్ని ంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


విద్యుత్‌శాఖ అధికారులను ప్రశ్నించిన రైతులు


టంగుటూరు, ఆగస్టు 4: వ్యవసాయ మోటర్ల విద్యుత్‌ కనెక్షన్లకు ప్రభుత్వమే  బిల్లులు చెల్లించేటట్లయితే ఇప్పుడు మోటర్లకు మీటర్లెందుకని మండలంలోని పొందూరు రైతులు విద్యుత్‌శాఖ అధికారులను ప్రశ్ని ంచారు. ఇందుకు అంగీకరి స్తూ సంతకాలు పెట్టే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. పొందూరు గ్రా మాన్ని గురువారం ఏఈ వెంకటేశ్వర్లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాగయ్య, లైన్‌మన్‌ కలిసి సందర్శించారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న రైతులతో మాట్లాడారు.  వ్యవసాయ విద్యుత్‌ మోటర్లకు మీటర్లు బిగిస్తాం, విద్యుత్‌ బి ల్లులు మీరే చెల్లిస్తే ఆ బిల్లులు తాలూకా నిధులు మీ బ్యాంకు ఖాతాల్లో ప్ర భుత్వం జమ చేస్తుందని వివరించారు. ఇందుకు అంగీకరిస్తున్నట్లు రైతులు సంతకాలు పెట్టాలని వారు కోరారు. ఇందుకు రైతులు ససేమిరా అన్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని చెబుతున్నారు కదా, నేరుగా విద్యుత్‌ శాఖకే చెల్లించమనండి అంటూ వారికి సూచించారు. రైతులకు నచ్చచెప్పేందుకు విద్యుత్‌ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేది లేక వి ద్యుత్‌ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Updated Date - 2022-08-05T05:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising