ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగోన్నతుల ఉత్తర్వులేవి?

ABN, First Publish Date - 2022-12-07T01:35:55+05:30

ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రమోషన్‌కు ఆమోదం తీసుకున్న ప్రభుత్వం వారికి అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు జారీచేయడం మరిచిపో యింది. దీంతో ఉపాధ్యాయు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది తేల్చకుండానే సర్దుబాటు అంటూ హడావుడి

ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న ఉపాధ్యాయులు

ఒంగోలు(విద్య), డిసెంబరు 6: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రమోషన్‌కు ఆమోదం తీసుకున్న ప్రభుత్వం వారికి అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు జారీచేయడం మరిచిపో యింది. దీంతో ఉపాధ్యాయు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అయిన టీచర్లతోపాటు కొత్తగా ఉద్యోగోన్నతులు పొందిన వారికి నియామక ఉత్తర్వు లు ఇస్తామన్న ప్రభుత్వం బదిలీలను అటకెక్కించింది. వీరికి వారం క్రితం విద్యాశాఖ మంత్రి బొత్స ఇచ్చిన హామీ కూడా నీటిమీద రాతైంది. ఆ విషయం తేలకుండానే తాజాగా సబ్జెక్టు టీచర్ల సర్దుబాటుకు తెరతీసింది. దీంతో ఉద్యోగోన్నతుల ఉత్తర్వులు రాని టీచర్లు భగ్గుమంటున్నారు.

అంతా దోబూచులాటే

ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతుల విషయంలో ప్రభుత్వం ఏడాదిగా దోబూచులాడుతోంది. భారీస్థాయిలో ప్రమోషన్లు కల్పిస్తామని నమ్మించి చివరకు పరిమితంగానే ఇచ్చి ఉసూరుమనిపించారు. 2021 అక్టోబరులో టీచర్లకు ఉద్యోగోన్నతులప్పుడు మళ్లీ నవంబరు, డిసెంబరు మాసాల్లో ఇస్తామని నమ్మబలికారు. అయితే అది కాస్త ఈ ఏడాది అక్టోబరు నాటికి ముడిపడింది. అంటే ఏడాది తర్వాత మళ్లీ ఉద్యోగోన్నతులు ఇచ్చారు కానీ ఉత్తర్వులు ఇవ్వలేదు. బదిలీల తర్వాత ఇస్తారని ఆశించిన టీచర్లకు నిరాశే మిగిలింది. తాజాగా సర్దుబాటు చేపట్టడంతో ఇక ఇప్పట్లో తమకు ఉత్తర్వులు ఇవ్వరేమోనని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోతే ఆ కేడర్‌లో సర్వీసును కోల్పోతారు. ఉద్యోగోన్నతి పొందిన తేదీ నుంచే వారికి కొత్త కేడర్‌లో సర్వీసు లెక్కల్లోకి వస్తోంది. అదే విధంగా వారికి ఆర్థికలాభం(ఇంక్రిమెంట్ల ద్వారా) కూడా కొత్తపోస్టులో చేరిన తేదీ నుంచి మాత్రమే వస్తుంది. ఈ విధంగా టీచర్లు ఆర్థికపరంగా, సర్వీసుపరంగా నష్టపోతున్నారు. అందువల్ల వారికి సర్దుబాటుకు ముందే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని టీచర్లు, టీచర్ల సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T01:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising