ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2022-07-01T04:59:34+05:30

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని శాప్‌నె ట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

అద్దంకిలోని 19వ వార్డులో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న కృష్ణచైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

అద్దంకి, జూన్‌ 30: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని శాప్‌నె ట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.  గురువారం పట్టణంలోని 19వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ల బ్ధిదారులకు కలిశారు. వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించటం జరుగుతుం దన్నారు. 

వృద్ధ దంపతులను పరామర్శించిన కృష్ణచైతన్య

అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో దొంగ డాడి చేయటంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులు కొత్తమాసు హనుమంతరావు, విజయకుమారిని ఒం గోలులోని వైద్యశాలలో పరామర్శించారు. ముందుగా  అద్దంకిలో చోరీ జరిగిన ఇంటి వద్ద సీఐ రోశయ్యతో కలిసి పరిశీలించారు. చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చోరీ కేసును వేగవంతంగా ఛేదించా లని కోరారు. కార్యక్రమాల్లో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మన్‌లు పద్మేష్‌, అనంతలక్ష్మి, కౌన్సిలర్‌ ఏజెండ్ల నాగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌, కొల్లా భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T04:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising