టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి
ABN, First Publish Date - 2022-12-07T23:56:49+05:30
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ది ఫలాలు అందాయని తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జ్, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, వేమూరి రామయ్యలు అన్నారు. మండలంలోని భట్టుపల్లి గ్రామంలో బుధవారం ఇదేం ఖర్మ రాష్ర్టానికి అనే కార్యక్రమానికి నిర్వహించారు.
పీసీపల్లి,డిసెంబరు7: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ది ఫలాలు అందాయని తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జ్, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, వేమూరి రామయ్యలు అన్నారు. మండలంలోని భట్టుపల్లి గ్రామంలో బుధవారం ఇదేం ఖర్మ రాష్ర్టానికి అనే కార్యక్రమానికి నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమైన పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాలలో ప్రతి వర్గానికి అన్యాయం చేసిందన్నారు. సంక్షేమం పేరుతో ఒకచేత ఇచ్చినట్టే ఇచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మరోచేత్తో లాగేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెట్రోలు, డీజిలు, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు అన్నివిధాలా నష్టం చేకూర్చింది ఈ ప్రభుత్వం అని అన్నారు. గ్రామంలోని ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించితేనే అన్నివర్గాల ప్రజలంతా అభివృద్ధి సాధిస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఏనుగంటి శ్రీను, ముప్పవరపు మాచర్లు, మూలె వెంకటేశ్వరరెడ్డి, ములకా నాగేశ్వరరావు, గుదేవారిపాలెం సర్పంచ్ కనపర్తి శాంసన్, చలంచర్ల యోగయ్య, మూలె పుల్లారెడ్డి, ఓంకారం, ఏనుగంటి తిరుపతయ్య, మూలె మహేంద్రరెడ్డి, పరిమి వెంకటేశ్వర్లు, కోమటిగుంట్ల వీరయ్య, గుంటగాని జోసెఫ్, బద్దిపూడి ఎబినేజరు, ఎడ్లపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:56:51+05:30 IST