ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృథా నీటిని అరికట్టాలి

ABN, First Publish Date - 2022-01-22T06:21:44+05:30

మోపాడు రిజర్వాయర్‌లోని నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురిసి రిజర్వాయర్‌ నిండుకుండలా మారిన విషయం తెలిసిందే.

వృథాగా పోతున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరు, జనవరి 21: మోపాడు రిజర్వాయర్‌లోని నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురిసి రిజర్వాయర్‌ నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. రిజర్వాయర్‌లో వృథాగా పోతున్న నీటితో కంభాలదిన్నె, తూర్పుకట్టకిందపల్లి తదితర గ్రామాల ఆయకట్లు రైతులు జొన్న, బొబ్బర్లు లాంటి మెట్ట పంటలను సాగుచేసుకున్నారు. ప్రస్తుతం తూము గేటు పైకి లేపి మరోసారి దించే క్రమంలో  గేటు లాక్‌ అయ్యింది. హుటాహుటిన ఇరిగేషన్‌శాఖ అధికారులు సంబంధిత ఇరిగినే్‌షశాఖ సిబ్బందితో మరమ్మత్తులు చేపట్టినా నీటి ఉదృతి ఆగలేదు. నీటి ఉదృతి తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరమ్మతులు చేయలేక పోతున్నామని సిబ్బంది తెలిపారు. రైతులతో కలిసి గడ్డితో  నీటి ఉదృతి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మోపాడు రిజర్వాయర్‌ డీఈ రవికుమార్‌ తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి తూము గేట్లు ఎత్తకపోవడంతో అవి స్వల్పంగా మరమ్మత్తులకు గురవుతున్నాయని వాటికి మరమ్మతులు చేస్తున్నామన్నారు.


Updated Date - 2022-01-22T06:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising