ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-01-29T04:51:34+05:30

పాత పీఆర్సీతోనే తమకు జనవరి నెల వేతనాలు ఇవ్వాలని జిల్లాలో ఉద్యోగులు డ్రాయింగ్‌ ఆఫీసర్లకు వినతులు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 27వేల మందికిపైగా ఉద్యోగులు ట్రెజరీ శాఖ ద్వారా వేతనాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం వేతనాలు ఇవ్వాలని ట్రెజరీ శాఖకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

పాత పీఆర్సీ ప్రకారం జనవరి నెల వేతనాలు ఇవ్వాలని జిల్లా పరిషత్‌ సీఈవో జాలిరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న జడ్పీ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డ్రాయింగ్‌ ఆఫీసర్లకు వినతులు ఇస్తున్న ఉద్యోగులు

కొత్త పీఆర్సీ నుంచి వేతనాలు తీసుకునేందుకు విముఖత

ట్రెజరీలకు పోలీస్‌ శాఖ నుంచి డేటా

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 28 : పాత పీఆర్సీతోనే తమకు జనవరి నెల వేతనాలు ఇవ్వాలని జిల్లాలో ఉద్యోగులు డ్రాయింగ్‌ ఆఫీసర్లకు వినతులు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 27వేల మందికిపైగా ఉద్యోగులు ట్రెజరీ శాఖ ద్వారా వేతనాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం వేతనాలు ఇవ్వాలని ట్రెజరీ శాఖకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే తగ్గిన వేతనాలు తమకొద్దని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. జిల్లాలో 1,185మంది డ్రాయింగ్‌ ఆఫీసర్లు (డీడీవోలు) ఉండగా 70శాతానికిపైగా సంబంధిత కార్యాలయాల్లో పనిచేసే అధికారుల నుంచి సిబ్బంది వరకు పాత వేతనాలతోనే తమకు బిల్లులు ట్రెజరీలకు పంపాలని కోరినట్లు సమాచారం. కాగా కొందరు ఎంపీడీఓలు కూడా జడ్పీ కార్యాలయంలో పాత పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు జడ్పీలో పనిచేసే ఉద్యోగులు శుక్రవారం పాత పీఆర్సీ పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని జడ్పీ సీఈవో జాలిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మరోవైపు ప్రభుత్వ పెన్షనర్లు కూడా పాత పీఆర్సీ కోరుతూ వినతులు అందజేసినట్లు తెలిసింది. 

ట్రెజరీలకు వచ్చిన 3,500 మంది ఉద్యోగుల కొత్త డేటా

ప్రభుత్వం కొత్త డేటా ప్రకారం వేతనాల బిల్లులు పెట్టాలని ఆదేశించడంతో జిల్లాలో 3,500మంది ఉద్యోగులు ఇప్పటివరకు ట్రెజరీ కార్యాలయాలకు డేటా పంపినట్లు సమాచారం. ఆ విధంగా పోలీస్‌ శాఖ నుంచి అత్యధికంగా 3వేల మంది  ఉద్యోగుల డేటా రాగా, 300మంది ఉద్యోగులు మున్సిపాలిటీల నుంచి, మరో 200 మంది ఉద్యోగులు వివిధ శాఖల నుంచి డేటాలను ఇచ్చినట్లు సమాచారం. అయితే ట్రెజరీలకు డేటా పంపిన ఉద్యోగులు సర్వీసు రిజిస్టర్లు తీసుకొని రావడం లేదని సమాచారం. దీంతో ట్రెజరీ ఉద్యోగులు కూడా ఆ డేటాను అప్‌లోడ్‌ చేయలేదని తెలుస్తోంది. 

పోలీసుల జీతాలకు మాత్రం కసరత్తు

  రివర్స్‌ పీఆర్సీ వద్దంటూ ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జనవరి వేతనాల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈక్రమంలో పోలీసులకు మాత్రం ఎలాగోలా జీతాలు ఇచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ట్రెజరీకి బిల్లులు పంపించారు. అంతేకాకుండా నూతన పీఆర్సీ ప్రకారం జీత భత్యాలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సిబ్బంది సర్వీస్‌ రికార్డులను కూడా తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ఒకటో తేదీన పోలీసులకు జీతాలు పడే అవకాశం ఉంది.


Updated Date - 2022-01-29T04:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising