ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్వో వర్సెస్‌ రైతు బంధువు!

ABN, First Publish Date - 2022-02-23T06:07:34+05:30

అద్దంకి తహసీల్దార్‌ కార్యాలయంలోని ఓ వీఆర్వో, పట్టణంలోని న ర్రావారిపాలెంనకు చెందిన ఓ రైతు బంధువు మధ్య జరిగిన వాగ్వాదం, ఒకరి నెత్తిన మరొ కరు చేతులు పెట్టి ప్రమాణాలు చేసుకున్న వీ డియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం

పాసు పుస్తకానికి లంచం అడిగినట్లు ఒకరు.. లేదంటూ మరొకరు ప్రమాణం

 సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ 


అద్దంకి, ఫిబ్రవరి 22 : అద్దంకి తహసీల్దార్‌ కార్యాలయంలోని ఓ వీఆర్వో, పట్టణంలోని న ర్రావారిపాలెంనకు చెందిన ఓ రైతు బంధువు మధ్య జరిగిన వాగ్వాదం, ఒకరి నెత్తిన మరొ కరు చేతులు పెట్టి ప్రమాణాలు చేసుకున్న వీ డియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. అందిన సమాచారం మేరకు.. స్థానిక నర్రావారిపాలెంకు చెందిన నర్రా జానకమ్మకు ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 261  సర్వే నెంబరులో 1-74 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి గతంలో ఆమె పేరుతో పట్టాదారు పాసుపుస్తకం ఉంది. అది ఆన్‌లైన్‌ కూడా అ య్యింది. ఆమె రెండేళ్లలో రెండుసార్లు ఈ-పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూ రు కాలేదు. ఈ విషయమై జానకమ్మ భర్త ల క్ష్మీనారాయణ, అల్లుడు దొప్పలపూడి ప్రసాద్‌ సోమవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వీఆర్వో బాషాను ప్రశ్నించారు. దీంతో వీఆర్వో కు, ప్రసాద్‌కు మధ్య మాటామాటా పెరిగింది. తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అదే సమ యంలో లంచం ఇవ్వకపోవడంతోనే ఇలా చేశా వంటూ ప్రసాద్‌ ఆరోపించాడు. నేను అడగలే దని వీఆర్వో వాదించాడు. అనంతరం లంచం అడిగావని ప్రసాద్‌, లేదని వీఆర్వో ఇద్దరూ ఒక రి నెత్తిన మరొకరు చేతులు పెట్టి ప్రమాణం చేశారు. ఈ వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పొలంలో ఇటు క బట్టీ ఉండటంతో ఈపాస్‌ పుస్తకం మంజూ రు కుదరలేదని వీఆర్వో బాషా  అంటుండగా, అది ముందుగా ఎందుకు చెప్పలేదని రైతు బ ంధువు ప్రసాద్‌ ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయం తహసీల్దార్‌ ప్రభాకరరావు దృష్టికి వెళ్లడంతో వీ ఆర్వో బాషాను మందలించినట్లు తెలుస్తోంది.  



Updated Date - 2022-02-23T06:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising