ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ పథకాలు రైతులకు అందేలా వలంటీర్లు పనిచేయాలి

ABN, First Publish Date - 2022-10-08T04:22:43+05:30

వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వ పఽథకాలు సత్వరమే అందేలా వలంటీర్లు పనిచేయాలని మండల వ్యవసాయశాఖ ఏవో కుమారి కోరారు. శుక్రవారం మండలంలోని అన్ని సచివాలయాలలో పనిచేస్తున్న వలంటీర్లలో ఒకరిని రైతు భరోసా కేంద్రం ద్వారా పనిచేసేందుకు శిక్షణ ఇచ్చారు.

వలంటీర్ల శిక్షణలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ ఏవో కుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బల్లికురవ, అక్టోబరు 7 : వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వ పఽథకాలు సత్వరమే అందేలా వలంటీర్లు పనిచేయాలని మండల వ్యవసాయశాఖ ఏవో కుమారి కోరారు. శుక్రవారం మండలంలోని అన్ని సచివాలయాలలో పనిచేస్తున్న వలంటీర్లలో ఒకరిని రైతు భరోసా కేంద్రం ద్వారా పనిచేసేందుకు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఏవో మాట్లాడుతు వ్యవసాయ సిబ్బందితో కలిసి అనుసంధానంగా వలంటీర్లు పనిచేయాలన్నారు. రైతులు ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈకేవైసీ వంటి వాటిల్లో నమోదు అయ్యేలా చేయాలన్నారు.  


తక్షణమే ఈ కేవైసీ చేయించుకోవాలి

మండలంలోని పలు గ్రామాలలో ఖరీఫ్‌ కింద 4,805 మంది రైతులు పంట నమోదు చేయించుకున్నారని, తక్షణమే వారందరు ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకొని రైతులకు ప్రభుత్వం ఈనెల 10 వ తేదీ వరకు గడువు ఇచ్చిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఏవో కోరారు. 


 మార్టూరులో..

మార్టూరు : ప్రభుత్వ పఽథకాలను లబ్ధిదారులకు సకాలంలో అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఏడీఏ సుదర్శన్‌రాజు అన్నారు. మండలంలో ఎంపిక చేసిన వలంటీర్‌లకు శిక్షణా కార్యక్రమం శుక్రవారం స్థానిక రైతు భరోసా కేంద్రంలో జరిగింది. ఒక్కో రైతు భరోసా కేంద్రానికి ఒక్కో వలంటీర్‌ను కేటాయించారు. పంట నమోదును వేగవంతం చేయాలన్నారు.

Updated Date - 2022-10-08T04:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising