4 నుంచి విజయవాడ-బిట్రగుంట పాసింజర్ రైలు
ABN, First Publish Date - 2022-04-29T05:35:52+05:30
విజయవాడ- బిట్రగుంట పాసింజర్ రైలు మే 4 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని విజయవాడ రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు. ట్రైన్ నెం 07978 విజయవాడలో మధ్యాహ్నం 1.45కు బయలుదేరి 4.40కు ఒంగోలు, బిట్రగుంటకు 8.30కు చేరుకుంటుంది.
ఒంగోలు (కార్పొరేషన్), ఏప్రిల్ 28 : విజయవాడ- బిట్రగుంట పాసింజర్ రైలు మే 4 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని విజయవాడ రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు. ట్రైన్ నెం 07978 విజయవాడలో మధ్యాహ్నం 1.45కు బయలుదేరి 4.40కు ఒంగోలు, బిట్రగుంటకు 8.30కు చేరుకుంటుంది. (శుక్రవారం ఉండదు). అలాగే ట్రైన్ నెం 07977 బిట్రగుంటలో తెల్లవారుజామున 4గంటలకు బయలుదేరి, ఉదయం 5.15కు ఒంగోలు, 9.25 విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. (ఆదివారం ఉండదు) ఇప్పటివరకు కొవిడ్ కారణంగా నిలిపివేసిన పాసింజర్ రైలును తిరిగి యథావిధిగా పునరుద్ధరించారు. ప్రయాణికులు గమనించి, పాసింజర్ రైలు సేవలను వినియోగించుకోవాలని వెల్లడించారు.
Updated Date - 2022-04-29T05:35:52+05:30 IST