వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ABN, First Publish Date - 2022-03-06T05:12:19+05:30
శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవస్థానంలో హరేరామ నామ సప్తాహ బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.
ప్రత్యేక అలంకరణలో దేవతామూర్తులు
మార్కాపురం, మార్చి 5: శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవస్థానంలో హరేరామ నామ సప్తాహ బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. రెండవ రోజు శనివారం శ్రీ లక్ష్మీ, పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామికి కల్యాణం వైభ వంగా నిర్వహించారు. కల్యాణ ఉభయదాతలుగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దంపతులు, కౌన్సిలర్ గుంటక వనజాక్షి చెన్నారెడ్డి దం పతులు, మరో 14 జంటలు పాల్గొన్నారు. వేదపండితులు కె.భరద్వాజ్ కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Updated Date - 2022-03-06T05:12:19+05:30 IST