ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాసవీ ఆలయ దుకాణాలు స్వాధీనం

ABN, First Publish Date - 2022-11-24T22:57:56+05:30

కురిచేడులోని వాసవీ ఆలయం ముందు ఉన్న దుకాణాలను హైకోర్టు ఆర్డర్‌తో పంచాయతీ కార్యదర్శి చాం ద్‌బీ గురువారం స్వాధీనం చేసుకున్నారు.

కార్యదర్శితో గొడవకు దిగిన దుకాణ యజమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీ చేయాలని కార్యదర్శి నోటీసులు

దుకాణదారులు, పంచాయతీ సిబ్బంది మధ్య ఘర్షణ

త్వరలో షాపులకు వేలం

కురిచేడు, నవంబరు 24 : కురిచేడులోని వాసవీ ఆలయం ముందు ఉన్న దుకాణాలను హైకోర్టు ఆర్డర్‌తో పంచాయతీ కార్యదర్శి చాం ద్‌బీ గురువారం స్వాధీనం చేసుకున్నారు. త్వర లో వేలం పాట ద్వారా దుకాణాలను కేటాయిస్తామని ఆమె స్పష్టం చేశారు. కురిచేడు ప్ర ధాన కూడలిలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. 50 సంవత్సరాల క్రితం వా సవీ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపురం కింద కొన్ని దుకాణాలను నిర్మించారు. వాటిని అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయంతో అమ్మవారి దేవస్థానం నడపడానికి ఖర్చు చేస్తున్నారు. కురిచేడుకు చెందిన ఓ వ్యక్తి దుకాణాలు పంచాయతీకి చెందిన స్థలంలో నిర్మించారని, ఆ దుకాణాలు పంచాయతీకి చెందాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆ దుకాణాలను పంచాయతీవారు స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత ్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాతో పంచాయతీ కా ర్యదర్శి చాంద్‌బీ దుకాణాలు ఖాళీ చేయాలని యజమానులకు నోటీసులు జారీ చేశారు. దుకాణాదారులెవరూ ఖాళీ చేయకపోవడంతో గురువారం పంచాయతీ కార్యదర్శి దుకాణాల వద్దకు వచ్చి ఖాళీ చేయాలని చెప్పి దుకాణాలకు నంబర్లు రంగులతో వేశారు. మొత్తం 7 దుకాణాలకు నంబర్లు వేశారు. ఆ సమయంలో దుకాణాదారులకు, పంచాయతీ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నామని ఇపుడు ఖాళీ చేయమంటే ఎలా అని పంచాయతీ కార్యదర్శి చాంద్‌బీని ప్రశ్నించారు. పంచాయతీ సిబ్బంది దుకాణాలకు వరుస నంబర్లు వేశారు. త్వరలో దుకాణాలకు వేలంపాట నిర్వహించి దుకాణాలను పాటదారులకు అందజేస్తామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వాసవీ ఆలయానికి రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ ఉందని, దుకాణాలు అమ్మవారి ఆలయానికే చెందుతాయని ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

Updated Date - 2022-11-24T22:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising