ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాశాఖలో బదిలీలు పూర్తి

ABN, First Publish Date - 2022-06-30T06:35:35+05:30

జిల్లా విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీల పర్వం పూర్తయింది. మూడు కేడర్లలో మొత్తం 46మంది బదిలీ అయ్యారు. డీఈవో విజయభాస్కర్‌ ఈ ప్రక్రియను పూర్తిచేశారు.

ఒంగోలులోని డీఈవో కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

46 మంది ఉద్యోగులకు స్థానచలనం

ఒంగోలు(విద్య), జూన్‌ 29 : జిల్లా విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీల పర్వం పూర్తయింది. మూడు కేడర్లలో మొత్తం 46మంది బదిలీ అయ్యారు. డీఈవో విజయభాస్కర్‌ ఈ ప్రక్రియను పూర్తిచేశారు. జిల్లాలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు. బాపట్ల జిల్లాల డీఈవోలతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. అయితే బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు నెల్లూరు, బాపట్ల డీఈవోల ప్రతినిధులుగా ఆ రెండు జిల్లాల సూపరింటెండెంట్లు హాజరయ్యారు. ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారందరినీ బదిలీ చేశారు. అభ్యర్థన మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మన్నించి  స్థానచలనం కల్పించారు. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు అత్యధికంగా 23మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 13మంది, ఆఫీసు సబార్డినేట్లు 10మంది బదిలీ అయ్యారు. వారు శుక్రవారానికి కొత్త స్థానాల్లో చేరాలని డీఈవో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కందుకూరు ఉప విద్యాధికారి సురేష్‌, పర్చూరు ఉపవిద్యాధికారి జి.పాండురంగారావులను మైనంపాడు డైట్‌కు బదిలీ చేశారు. 

 

Updated Date - 2022-06-30T06:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising