ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమ్మమూరు బ్రిడ్జిపై రాకపోకలు నిషేధం

ABN, First Publish Date - 2022-05-18T05:34:19+05:30

మండలంలోని సంతరావూరు గ్రామ సమీపంలోని కొ మ్మమూరు కాలువపై గల బ్రిడ్జిపై రాక పోకలను నిషేధించారు.

బ్రిడ్జిపై రాకపోకలు జరగకుండా జెండాను ఏర్పాటుచేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంధ్రాలు పడి కుంగిన వైనం 

అప్రమత్తమైన గ్రామస్థులు

చినగంజాం, మే 17: మండలంలోని సంతరావూరు గ్రామ సమీపంలోని కొ మ్మమూరు కాలువపై గల బ్రిడ్జిపై రాక పోకలను నిషేధించారు. బ్రిడ్జి బలహీనం గా ఉండటంతో ప్రమాదాలు జరుగుతా యనే అంచనాలతో గ్రామస్థులు రాక పోకలను మంగళవారం నిలిపివేశారు. సోమవారం రాత్రి బ్రిడ్జిపై సిమెంట్‌ లో డుతో భారీ వాహనం వెళ్లటంతో బ్రిడ్జిపై రంధ్రాలు ఏర్పడ్డాయి. ఇది గమనించిన స్థానికులు బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రాకపోకలను నిలిపి వేశారు. గ్రామస్థులు చెకూరి రమేష్‌, దేవతోటి చిన్నఇజ్రాయిల్‌, బెజ్జం శ్రీను తదితరులు బ్రిడ్జిపై అడ్డుగా తాడు కట్టి ఎర్రజెండాను ఏర్పాటుచేశారు. సంబంధిత శాఖాధికారులు వచ్చి పరిశీ లించి మరమ్మతుల అనంతరం రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపా రు. బ్రిడ్జిపై రంధ్రాలు పడిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చె ప్పారు.

 చీరాల, అద్దంకి, ఇంకొ ల్లు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను కడవకుదురు మీదగా వెళ్లే విధంగా దారి మళ్లించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేం దుకు ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ బ్రిడ్జిని 1931లో బ్రిటిష్‌ వారు నిర్మించారు. 2019 జనవరి నెలలో ఒక పర్యాయం బ్రిడ్జి దెబ్బతినడం తో రాకపోకలను నిషేధించి మరమ్మతులు చేశారు. మరలా బ్రిడ్జిపై రంధ్రాలు పడి కుంగటంతో  రాకపోకలకు అవరోధం ఏర్పడింది. పాత బ్రిడ్జిని తొలగించి ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే నూతన బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.  

Updated Date - 2022-05-18T05:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising