ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ పరిహారం పేరుతో టోకరా !

ABN, First Publish Date - 2022-10-07T06:30:56+05:30

కొవిడ్‌ రిలీఫ్‌ (పరిహారం) వస్తుందని ఫోన్‌ చేసి ఓ యువతి ఖాతాలో రూ.90 వేలను లాగేసుకున్నారు సైబర్‌నేరగాళ్లు. ఈ సంఘటన గు రువారం ఒంగోలు నగరం భాగ్యనగర్‌ 4లైన్‌లో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంక్‌ ఖాతాలో రూ.90వేలు స్వాహా 

ఒంగోలు(క్రైం), అక్టోబరు6: కొవిడ్‌ రిలీఫ్‌ (పరిహారం) వస్తుందని ఫోన్‌ చేసి ఓ యువతి ఖాతాలో రూ.90 వేలను లాగేసుకున్నారు సైబర్‌నేరగాళ్లు. ఈ సంఘటన గు రువారం  ఒంగోలు నగరం భాగ్యనగర్‌ 4లైన్‌లో జరిగింది. వివరాలలోకి వెళితే.. తాము ప్రకాశంభవన్‌ నుంచి మాట్లాడుతున్నామని, భాగ్యనగర్‌ క్లష్టర్‌లో ఉన్న 8 మంది వలంటీర్లకు వరుసగా ఒకే వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీ పరిధిలో కొవిడ్‌తో మృతి చెందిన వారి వివరాలు కోరాడు. వారికి రూ.లక్ష నగదు వస్తుందని వారి బ్యాంక్‌ అకౌంట్‌ వి వరాలు కావాలని చెప్పాడు. అయితే వారిలో ఒకరు మాత్రమే తన వద్ద ముగ్గురు వి వరాలు ఉన్నాయని వలంటీర్‌ తెలియజేసింది. దీంతో ఆ ప్రాంతంలో పనిచేసే ఏఎ న్‌ఎంతో ఫోన్‌లో ఆ వ్యక్తి మాట్లాడాడు. సరైన సమాచారం లేకుండా ఏమిటీ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా మాట్లాడిన తరువాత భాగ్యనగర్‌ 4వ లైన్‌లో నివాసం ఉంటున్న గాంధీ ఏడాది క్రితం కొవిడ్‌తో మృతి చెందినట్లు వ లంటీర్‌ అతడితో చెప్పింది. వారి కుటుంబ సభ్యుల్లో మహిళకు ఉన్న  బ్యాంక్‌ అకౌంట్‌  వివరాలు, ఫోన్‌ నంబరు కావాలని తీసుకున్నాడు. అనంతరం ఆ మహిళకు ఫోన్‌ చేసి మీ ఖాతాలో కనీసం రూ.లక్ష నగదు ఉంటేనే మరో రూ.లక్ష ప్రభుత్వం నుంచి వచ్చే నగదు జమ అవుతుందని దుండగుడు చెప్పడంతో వెంటనే వారు ఆమె ఖాతాలో రూ. లక్ష జమ చేశారు. అనంతరం మరలా ఫోన్‌ చేసి మీ బ్యాంక్‌ ఖాతాలో నగదు వేసేం దుకు ఓటీపీ వస్తుందని చెప్పి మూడుమార్లు సుమారు రూ.90 వేల నగదును  ఖాతా నుంచి లాగేశాడు. కొద్దిసేపటి తరువాత ప్రభుత్యం ఇచ్చే నగదు పక్కన పెడితే బాధి తురాలి ఖాతాలో నగదును విత్‌డ్రా చేసుకున్నట్లు మెసేజ్‌లు రావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


Updated Date - 2022-10-07T06:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising