ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు పంచాయతీలకు లేని కార్యదర్శులు

ABN, First Publish Date - 2022-10-18T04:04:13+05:30

మండలంలోని మూడు గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శులు లేక పాలన కుంటు పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సేవలందక ఇబ్బంది పడుతున్న ప్రజలు 

నియామకంలో అధికారుల తాత్సారం

తాళ్లూరు, అక్టోబరు 17 : మండలంలోని మూడు గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శులు లేక పాలన కుంటు పడుతోంది. సంబంధిత అధికా రులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 14 గ్రామసచివాలయాలు  ఉండగా, మూడు సచివాలయాలకు కార్యదర్శులు లేరు. మం డ లంలో మేజర్‌ పంచాయతీ తూర్పుగంగవరం పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి విషయంలో అధికారపార్టీకి చెందిన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో ఇన్‌చార్జి కార్యదర్శిని తొ లగించి మాధవరం పంచాయతీ కార్యదర్శిని నియమించారు. ఆ కార్యదర్శి విఽధుల్లో చేరవద్దని వైసీపీ పాలకు లు ఒత్తిడి చేయడంతో ఆయన విధుల్లోకి చేరలేదు. అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జయంతిరోజు గ్రామపంచాయతీ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఈనెల 1వ తేదీ లక్కవరం పంచాయతీ కార్యదర్శిని ఎంపీడీవో ఇన్‌ చార్జి కార్యదర్శిగా నియమించారు. విధుల్లో చేరిన కా ర్యదర్శి గ్రామంలో వైసీపీ నేతల్లో  ఉన్న ఆధిపత్య పో రుతో ఒత్తిడికి తట్టుకోలేక తూర్పుగంగవరం పంచాయతీ విధులు నిర్వహించక దూరంగా  ఉన్నారు. దా దాపు 10రోజుల పాటు కార్యదర్శి పంచాయతీ కార్యాల యంవైపు కన్నెత్తి చూసిన పాపానలేదు. ఇదిలా వుండగా తూర్పుగంగవరం ఇన్‌చార్జి కార్యదర్శి, లక్క వరం రెగ్యులర్‌ కార్యదర్శి ఆవుల సుజాత లంచం తీసుకుంటూ ఈనెల 10న ఏసీబీ అధికారులకు పట్టుబడి రి మాండ్‌ ఖైదీగా ఉన్నారు. దీంతో ఉన్నతాధికారులు ఆ మెను సస్పెండ్‌ చేస్తూ ఈనెల 13వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో తూర్పుగంగవరం, లక్కవరం సచివాలయాలకు కార్యదర్శుల కొరత ఏర్పడింది. తురకపాలెం గ్రామ ఇన్‌చార్జి కార్యదర్శి ఇష్టానుసారంగా వి ధులు నిర్వహిస్తుండడంతో పాటు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని వెంటనే ఇన్‌చార్జి కా ర్యదర్శిని మార్చాలని గ్రామ సర్పంచ్‌ చంద్రగిరి గుర్వారెడ్డి ఎంపీడీవో కేవై కీర్తికి 10 రోజుల క్రితం లిఖితపూర్వక ఫిర్యాధు చేశారు. దీంతో ఇన్‌చార్జి కార్యదర్శి తురకపాలెం ఇన్‌చార్జి కార్యదర్శి బాధ్యత  నుంచి తప్పుకుంటున్నానని ఈనెల 10న అధికారులకు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. ఆపంచాయతీకి నేటికీ కార్యదర్శిని నియ మించలేదు.  మండలంలో  తూర్పుగంగవరం సచివాలయానికి 15రోజులుగా, తురకపాలెం, లక్కవరం సచివాలయాలకుు 6 రో జులుగా  కార్యదర్శుల నియామకం జరుగలేదు. ప్రజలకు నిత్యం సచివాలయంతో  సంబంధాలున్నందున కార్యదర్శులు లేక పనులు సకాలంలో కావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వివిధ పనులపై సచివాలయకు వెళితే కార్యదర్శి లేరని చెప్తుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నామని పలువురు చెప్తు న్నారు.  కార్యదర్శుల నియామకంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కార్యదర్శులను నియమించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-10-18T04:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising