ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈ ఎంపీడీవో మాకొద్దు’!

ABN, First Publish Date - 2022-12-10T00:26:10+05:30

‘‘ఎంపీడీవో వై.శ్రీనివాసరావు గ్రామాల్లో అభివృద్ధి పనులు మరచి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. తక్షణం అతనిని ఇక్కడ నుంచి పం పించి వేయాలి.’’ అంటూ మండలంలోని ఎంపీటీ సీలు, సర్పంచులు ధ్వజమెత్తారు. ఆయనొక అభి వృద్ధి నిరోధకుడని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగులుప్పలపాడు మండల సమావేశంలో ప్రజాప్రతినిధుల డిమాండ్‌

ఆయన ఉన్నంత వరకు సమావేశాలకు వచ్చేది లేదంటూ వాకౌట్‌

నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌), డిసెం బరు 9: ‘‘ఎంపీడీవో వై.శ్రీనివాసరావు గ్రామాల్లో అభివృద్ధి పనులు మరచి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. తక్షణం అతనిని ఇక్కడ నుంచి పం పించి వేయాలి.’’ అంటూ మండలంలోని ఎంపీటీ సీలు, సర్పంచులు ధ్వజమెత్తారు. ఆయనొక అభి వృద్ధి నిరోధకుడని మండిపడ్డారు. శుక్రవారం నా గులుప్పలపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎం పీపీ నలమలపు అంజమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చేకూరపాడు సర్పంచ్‌ కొమ్మినేని రమేష్‌ మాట్లా డుతూ తమ గ్రామంలో వైసీపీ నాయకులు చెప్పి నట్లు ఎంపీడీవో పనులు చేయిస్తున్నారని ఆరో పించారు. రాయపూడి ధనలక్ష్మి అనే మహిళకు చెందిన పింఛన్‌ను సచివాలయం సిబ్బందితో క లిసి రాకుండా చేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంపీడీవో నిరోధకుడుగా తయారయ్యారని మండిపడ్డారు. మండలంలో ఎంపీడీవో శ్రీనివాసరావు ఉన్నంతకాలం మండల కార్యాలయానికి కానీ, సమావేశాలకు వచ్చేది లే దని చెప్పి సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. మ రికొంతమంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మాట్లా డుతూ ఎంపీడీవో గ్రామాల్లో లేనిపోని సమస్యలు సృష్టించి ఇబ్బందులకు గురిచేయటం చేస్తున్నార ని, తక్షణమే ఇక్కడ నుంచి పంపించి వేయాలని ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ ఎంపీడీవో శ్రీని వాసరావు మండలానికి వచ్చిన దగ్గర నుంచి తన పదవిని గౌరవించి మర్యాదపూర్వకంగా ఒక్కసారి కూడా కలవలేదన్నారు. తాను ఫోన్‌ చేసినా తీయ డం లేదని ఆరోపించారు. ఏదైన సమస్యపై కార్యా లయ సిబ్బందికి చెబితే ఎంపీడీవో అందుకు వ్యతి రేకంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.80 కోట్లు నిధులు ఉంటే ఇంతవరకు గ్రా మాలకు కేటాయించలేదని, ఉన్నతాధికారులు స్ప ందించి ఇక్కడ నుంచి బదిలీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జట్పీటీసీ యాదాల రత్నభారతి, మండల ప్రత్యేకాధికారి అంజల, ఎంపీడీవో వై. శ్రీనివాసరావు, ఎంపీటీసీలు మున్నంగి వెంకటరా వు, పొద పవన్‌, పాలపర్తి రత్తయ్య, శివకృష్ణ, స ర్పంచులు ఘట్టంనేని అశోక్‌, పోలినేని వెంకటే శ్వర్లు, పాలపర్తి బాలకోటి, గరికిముక్కల శ్రీనివాస రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఎంపీపీ కారును అడ్డుకున్న ఎస్‌ఐ

కాగా ముందుగా మండల సమావేశానికి కా రులో వస్తున్న ఎంపీపీ నలమలపు అంజమ్మ, జడ్పీటీసీ రత్నభారతిలను మండల కార్యాలయం లోకి వెళ్లకుండా ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి అడ్డగించారు. ఎంపీపీ కారు లోపలకు వెళ్లేందుకు వీలులేదని, దూరంగా ఉన్న తహసీల్దార్‌ కార్యాలయ ఆవర ణలో పెట్టి వెళ్లాలని చెప్పారు. దీంతో ఆగ్రహిం చిన ఎంపీపీ అంజమ్మ ఒక్కసారిగా కారు దిగి వ చ్చి తన కారును ఆపే అధికారం ఎవరు ఇచ్చా రంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏమైనా ఆపమ న్నారా అంటూ ప్రశ్నించారు. ‘‘మీకు ఎందుకు అంత అత్యుత్సాహం.. ఇంతమంది పోలీసులు దే నికోసం. ఇక్కడ ఎలాంటి గొడవలు ఉండవు. స మస్యలు సృష్టించటానికి వచ్చారా. తక్షణమే ఇక్క డ నుంచి వెళ్లిపోవాలి’’ అని ఎంపీపీ హెచ్చరిం చారు. దీంతో సీఐ రాంబాబు జోక్యం చేసుకుని స ర్ది చెప్పి ఎంపీపీ కారును లోపలికిపంపారు.

Updated Date - 2022-12-10T00:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising