ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు లేడు .. ఇకమీదట రాడు..

ABN, First Publish Date - 2022-08-11T04:25:23+05:30

జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు దేశంలో లేడు, ఇక మీదట రాడని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.ఎం కొండయ్య మండిపడ్డారు. జగన్‌ రూటే సపరేటని అందుకు జగన్‌ అనుసరిస్తున్న మద్యం పాలసీయే నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాదుడే, బాదుడు కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండయ్య స్థానిక టీడీపీ శ్రేణులతో కలసి 3,4 వార్డులలో పర్యటించారు.

బాదుడే, బాదుడు కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.ఎం కొండయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొండయ్య

చీరాల, ఆగస్టు 10 : జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు దేశంలో లేడు, ఇక మీదట రాడని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.ఎం కొండయ్య మండిపడ్డారు. జగన్‌ రూటే సపరేటని అందుకు జగన్‌ అనుసరిస్తున్న మద్యం పాలసీయే నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాదుడే, బాదుడు కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండయ్య స్థానిక టీడీపీ శ్రేణులతో కలసి 3,4 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తెలుగు రాష్ట్రాలకు ఒక చుక్కానిలాగా పనిచేస్తే, సీఎం జగన్‌ అవినీతి, అరాచక పాలనకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచారని దుయ్యబట్టారు. వైసీపీలోని పలువురు మంత్రులు, ఎంపీలు చేస్తున్న వికృతచేష్టలు అందుకు నిదర్శనమన్నారు. తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన సిగ్గుమాలిన పనిని కప్పిపుచ్చుకునేందుకు అతను బీసీ అని కులం కార్డు ఉపయోగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అత్యంత హేయమైనదిగా అభివర్ణించారు.  ముస్లిం మైనార్టీలకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఒనగూరిన ప్రయోజనాలకు ప్రస్తుతం జగన్‌ సర్కార్‌   తిలోదకాలు ఇచ్చిన వైనాన్ని వివరించారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో బాదుడే, బాదుడు కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు ఏర్పాటుచేసుకున్న కొన్ని ప్లెక్సీలను, తోరణాలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించటం చర్చనీయాంశమైంది. ఈ విషయమై మున్సిపల్‌ అధికారులను వివరణ అడగ్గా ముందస్తు అనుమతులు లేనందున, కార్యక్రమ అనంతరం వాటిని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T04:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising