ఇంటర్‌నెట్ పాయింట్ లో చోరీ
ABN, First Publish Date - 2022-10-08T04:18:37+05:30
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ లో ఉన్న ఇంటర్‌నెట్ పాయింట్‌లో చోరీ జరిగింది. రూ. 58,200 అపహరణకు గురయ్యాయి. మండలంలోని బొమ్మనంపాడుకు చెందిన జంపని సురే్‌షబాబు అద్దంకి పట్టణంలోని అభ్యుదయనగర్‌లో నివాసం ఉంటూ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అమరావతి ఇంటర్ నెట్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి షాపు మూసి వేసి కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి నగరోత్సవం తిలకించి ఇంటికి వెళ్లాడు.
58 వేల రూపాయల నగదు అపహరణ
అద్దంకి, అక్టోబరు7: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ లో ఉన్న ఇంటర్‌నెట్ పాయింట్‌లో చోరీ జరిగింది. రూ. 58,200 అపహరణకు గురయ్యాయి. మండలంలోని బొమ్మనంపాడుకు చెందిన జంపని సురే్‌షబాబు అద్దంకి పట్టణంలోని అభ్యుదయనగర్‌లో నివాసం ఉంటూ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అమరావతి ఇంటర్ నెట్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి షాపు మూసి వేసి కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి నగరోత్సవం తిలకించి ఇంటికి వెళ్లాడు. ఊరేగింపునకు వెళ్తూ రూ. 58,200 నగదును షాపులోనే ఉంచి వెళ్లాడు. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో షాపుపై కప్పు రేకులు తొలగించి దొంగ లోపలకు ప్రవేశించాడు. రేకులు తొలగించిన చోట సీలింగ్ కూడా తొలగించటంతో అక్కడ ఉన్న సీసీ కెమెరా కూడా ధ్వంసం అయ్యింది. దొంగ జిరాక్స్ మిషన్ మీద కాలు పెట్టి దిగటంతో జిరాక్స్ మిషన్ కూడా ధ్వంసం అయ్యింది. సంఘటనాస్థలాన్ని ఎస్సై ఆదిలక్ష్మి పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిము ద్రలు సేకరించారు. సురే ష్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.
Updated Date - 2022-10-08T04:18:37+05:30 IST