వైసీపీ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు
ABN, First Publish Date - 2022-06-23T04:47:25+05:30
వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
కనిగిరి, జూన్ 22 : వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కడప జిల్లాలో రైతు సమస్యలపై జరిగే పోరాట కార్యక్రమానికి వెళ్తున్న ఆయన కనిగిరిలో బుధవారం స్థానిక టీడీపీ నాయకులు, తెలుగురైతు అధ్యక్షులతో టీడీపి ఇన్‌చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు సిఫార్సు చేసిన రైతులకు మాత్రమే పంట బీమా పడిందని, పూర్తి స్థాయిలో బీమా పరిహారం పంట నష్టపోయిన రైతులందరికీ పడలేదని చెప్పా రు. రైతులు పంట నష్ట పోయి, ఇప్పుడు బీమా పరిహారం రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రైతులకు అనేక సబ్సిడీ పథకాల ద్వారా మేలు చేకూర్చారన్నారు. కానీ సీఎం జగన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అన్యాయంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం, రైతులపై విద్యుత్ బిల్లుల భారం మోపుతున్నారన్నారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు ఇంద్రభూపాల్‌రెడ్డి, నగరపంచాయతీ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఫిరోజ్, నాయకులు తుమ్మా వెంకటరత్నం, సానికొమ్ము తిరుపతిరెడ్డి, మీనిగ కాశయ్య, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-23T04:47:25+05:30 IST