ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలను పీక్కుతింటున్న వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-07-02T05:11:23+05:30

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పేదలపై మోయలేని భారాలు మోపుతూ వారిని పీక్కుతింటున్నదని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి విమర్శించారు.

మాట్లాడుతున్న రామయ్య చౌదరి, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ చార్జీలు పెంచి మరోసారి బాదుడు

టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రామయ్యచౌదరి 

కొండపి, జూలై 1 : రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పేదలపై మోయలేని భారాలు మోపుతూ వారిని పీక్కుతింటున్నదని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి విమర్శించారు. మరోసారి ఆర్టీసీ చార్జీలను పెంచి బాదుడుపై బాదుడును కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగుసార్లు ఆర్టీసీ చార్జీలను పెంచిందన్నారు. రెండు నెలల క్రితం భారీగా చార్జీల భారం మోపి ఇప్పుడు మళ్లీ బాదేసిందన్నారు. డీజిల్‌ సెస్‌ పేరుతో 30కి.మీ దాటిన ప్రయాణానికి అదనంగా పది రూపాయలు పెంచిందన్నారు. దీని వలన తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు రూ.70 నుంచి రూ.80 అదనపు భారం పడుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమం మాటున పేదలకు తక్కువ డబ్బులు ఇచ్చి తిరిగి సెస్‌లు, పన్నుల పేరుతో భారీగా గుంజుతున్నదని విమర్శించారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమంద నాయుడు, బీసీసెల్‌ రాష్ట్ర నాయకుడు బత్తుల నారాయణస్వామి,  సీనియర్‌ నాయకులు చాగంరెడ్డి నరసారెడ్డి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, కొండపి పట్టణ అధ్యక్షుడు బూదవాటి సోమయ్య, ముప్పరాజు శ్రీనివాసరావు, ఎస్సీసెల్‌ నాయకుడు యనమద్ని వెంకటేశ్వర్లు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్‌ ఖాఈషా పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising