ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను కొల్లగొడుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-18T04:51:15+05:30

నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలను కొల్లగొడుతూ సంక్షేమ పఽథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని తెలుగుదేశంపార్టీ పర్చూరు నియోజకవర్గ రైతుసంఘం అధ్యక్షుడు అప్పలనేని నరేంద్రబాబు విమర్శించారు. పర్చూరు మండల పరిధిలోని వీరన్నపాలెం గ్రామంలో బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు షేక్‌ షంషుద్ధీన్‌ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

వీరన్నపాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బాదుడే బాదుడులో టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు

వీరన్నపాలెం(పర్చూరు), అగస్టు 17: నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలను కొల్లగొడుతూ సంక్షేమ పఽథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని తెలుగుదేశంపార్టీ పర్చూరు నియోజకవర్గ రైతుసంఘం అధ్యక్షుడు అప్పలనేని నరేంద్రబాబు విమర్శించారు. పర్చూరు మండల పరిధిలోని వీరన్నపాలెం గ్రామంలో బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు షేక్‌  షంషుద్ధీన్‌ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుసంఘం నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు రైతులను విస్మరించిందన్నారు. రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి మాట్లాడుతూ  నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ కోట్లరూపాయల ప్రజాధనాన్ని జగన్‌ కూడకట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇంటింటా తిరిగి ప్రభుత్వ వైఫల్యాలపై  కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్‌ అధ్యక్షుడు బేతపూడి సురేష్‌, పుల్లెల పద్మావతి, కాపు రవిచంద్ర, అడ్డగడ సాంబశివరావు, కొరిటాల సురేష్‌, పఠాన్‌ సమీర్‌, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్‌ ఫజల్‌, గిరిబాబు, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, దాసి కిరణ్‌, షేక్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T04:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising