ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-06-25T06:23:01+05:30

ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్లింను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్కాపురం, జూన్‌ 24: ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో ముస్లిం  మహిళలకు టీడీపీ దుల్హన్‌ పథకం ద్వారా ఇస్తున్న రూ.50 వేలను రూ.లక్ష చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారన్నారు. మైనార్టీ విద్యార్థులకు చదువు కోసం టీడీపీ ఇస్తున్న రూ.10 లక్షలను రూ.15 లక్షలు చేస్తామని ఇప్పుడు ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేశారన్నారు. ఇమామ్‌లకు, మౌజన్‌ లకు ఇంటి స్థలాలు కేటాయిస్తామన్న హామీ ఇప్పుడేమైందన్నారు. తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువులో 30 ఏళ్లగా ఈద్గా, కబరి స్థాన్‌ల కింద ఉన్న  స్థలాలను వైసీపీ నాయకు లు కబ్జా చేశారన్నారు. సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ మల్లికార్జున్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలీ, ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి గోపీనాధ్‌, మాజీ కౌన్సిలర్లు సయ్యద్‌ గఫార్‌, షేక్‌ వలి, తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు : దుల్హన్‌ పథకం నిలిపివేత దుర్మార్గపు చర్య అని టీడీపీ పట్టణశాఖ అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, టీడీపీ మైనారిటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్‌ అహమ్మద్‌భాషా విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు షేక్‌ మదార్‌వలి, ఫాజిల్‌, గులామ్‌ గోవింద్‌, జీ.ఎం.వలి, ఖాదర్‌వలి, బుజ్జి, దూదేకుల నాయబ్‌ఖాజా,  పాల్గొన్నారు.

కంభం : దుల్హాన్‌ పథకాన్ని తుంగలోకి తొక్కడం అన్యాయమని టీడీపీ మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంభంలో శుక్రవారం సాయంత్రం కంభం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నిధుల కొరతతో దుల్హన్‌ పథకాన్ని నిలిపివేసినట్లు ప్రభుత్వం హై కోర్టుకు చెప్పడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి అనీస్‌ అహమ్మద్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు గౌస్‌, దాదా, నూరుల్లాఖాద్రి, సమన్‌, బషీర్‌ అహమ్మద్‌, దీనావలి, మహబూబ్‌భాషా, నవాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising